భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఫీడర్ సోలారైజేషన్, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల సంసిద్ధత, పర్యవేక్షణను నిర్ధారించాలని, ఈ పథకం అమలు, దీర్ఘకాలిక పనితీరును నిర్ధారించాలని APSPDCLను ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు.

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, సోలార్ రూఫ్‌టాప్, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను జవాబుదారీతనంతో వేగంగా పూర్తి చేయాలని సీఎస్ చెప్పారు. వీటికి సంబంధించి భూసేకరణ, లీజు రిజిస్ట్రేషన్లు, క్లియరెన్స్, ప్రాజెక్టు అమలును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

సోలార్ రూఫ్‌టాప్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చూస్తోంది. జనాలు అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే.. వేగవం...