Hyderabad, మే 4 -- ప్రొటీన్ అనేది జీవితంలోని ప్రతి దశలో అందరూ కచ్చితంగా తీసుకోవాల్సిన కీలకమైన ఆహారం. ఎందుకంటే అన్ని దశల్లోనూ శరీరం పెరుగుదల కోసం, కండరాలను బలపరచేందుకు కచ్చితంగా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఈ పోషకాహారాన్ని వయస్సుకు తగ్గట్టుగా ఎంతెంత తీసుకోవాలో తెలుసుకుందామా..

ఎదిగే వయస్సులో ప్రోటీన్ పిల్లలకు కండరాల ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. HT లైఫ్‌స్టైల్‌తో ఒక ఇంటర్వ్యూలో, పోషకాహార నిపుణురాలు, న్యూట్రి మేవెన్ వ్యవస్థాపకురాలు అనుషి జైన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇలా వివరించారు. "శిశువులకు రోజుకు 8-10.5 గ్రాములు, చిన్నపిల్లలకు 11.3 గ్రాముల ప్రొటీన్ అవసరం. పిల్లలు పెరిగే కొద్దీ వారి ప్రోటీన్ అవసరాలు పెరుగుతాయి. 4 నుంచి 6 ఏళ్ల పిల్లలకు 16 గ్రాములు, పిల్లలు పెద్దయ్యే వరకూ 34 గ్రాములు అవసరం" అని చెబుతున్నారు.

పోషకాహారం తింటున్న...