భారతదేశం, జనవరి 30 -- కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలో అత్యంత తీవ్ర (కేటగిరి-1) లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం. లోక్ సభలో వెల్లడించింది. డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికను లోక్‌సభలో విడుదల చేసింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబునిస్తూ. కేంద్ర జలమంత్రిత్వశాఖ ఈ సమాచారం అందజేసింది.

జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ(ఎన్డీఎస్‌ఏ) రూపొందించిన స్పెసిఫైడ్‌ డ్యామ్స్‌ జాతీయ రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌డీ) 2025లో 50 ఏళ్లు దాటిన 1681 డ్యాంలను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను అధ్యయనం చేసిన తర్వాత.. NDSA మేడిగడ్డను కేటగిరీ I - కింద పరిగణించినట్లు వివరించింది. పరిష్కరించని లోపాలు వైఫల్యానికి దారితీయవచ్చని హెచ్చరించినట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా మూడు డ్యామ్ లు ప్రమాద...