భారతదేశం, జనవరి 4 -- గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ మహ సభల్లో మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ధరమ్ బీర్ గోకుల్‌ను అశ్వరథంపై మహా సభల ప్రధాన వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌తోపాటుగా పలువురు ప్రముఖులు వేదికపై ఉన్నారు.

అనంతరం సభలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడారు. ప్రపంచంలో 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని గోకుల్ చెప్పారు. తెలుగు మహాసభలు.. భాష, నాగరికతను మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునే విధంగా ఉన్నాయన్నారు. తెలుగు మహాసభల నిర్వహణ ...