భారతదేశం, ఫిబ్రవరి 4 -- వెనకబడిన వర్గాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా, ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదరణ 3 పథకం ద్వారా కులవృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బీసీ సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు అక్కడ సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో పాటు హాస్టళ్లలో శానిటేషన్ తో పాటు విద్యార్ధులకు అందించే ఆహార ...