Andhrapradesh,telangana, ఆగస్టు 17 -- పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాం కుంగిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జాతీయ హోదా ఇచ్చి, ఎన్డీఏ ప్రభుత్వమే నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం కుంగిపోయి. కొట్టుకుపోయినా NDSAకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అదే కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే,. NDSA మూడు సార్లు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా అని గుర్తు చేశారు.

కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్-బీజేపీ నేతలకు 'పోలవరంను కూలవరం' అనే దమ్ము ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అని నిలదీశారు.

"అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత...