భారతదేశం, మే 21 -- పెళ్లైన రెండు రోజులకే పెళ్లి కొడుకు విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడి పుంజుల తండాలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోడి పుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (25) కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన జాహ్నవితో వివాహం నిశ్చయమైంది. ఆ తరువాత కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఈ నెల 18న ఆదివారం పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. ఏపీలోని విజయవాడ శివార్లలో ఉండే కంకిపాడులో ఇస్లావత్ నరశ్, జాహ్నవిల వివాహ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

మే 18న రాత్రి సమయంలో ఇస్లావత్ నరేశ్, జాహ్నవిల వివాహం జరగగా.. మంగళవారం కోడిపుంజుల తండాలో రిసెప్షన్ నిర్వహించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఏర్పాట్లు...