భారతదేశం, జూలై 18 -- పోర్చుగీస్ ద్వీపాలు, ఐరిష్ పబ్‌లు, న్యూయార్క్ వీధుల్లో సాహస యాత్రలు చేస్తూ, తన పసికందును ప్రపంచ యాత్రికుడిగా మార్చాలని ఓ తండ్రి పడిన తాపత్రయం ఇది. ప్రయాణాలంటే అంతులేని ప్రేమ ఉన్న ఒక నాన్న, ఆ ప్రేమను తన కుమారుడికి ఎలా పంచాలని ప్రయత్నించాడు? 'ట్రావెలర్స్ టేల్' సిరీస్ కోసం రచయిత సెబాస్టియన్ మోడక్ పంచుకున్న మరపురాని ప్రయాణ జ్ఞాపకాలివి.

నా కుమారుడు ఫెలిక్స్ మొదటిసారి నవ్విన క్షణం ఇంకా గుర్తుంది. అప్పుడు మేం లిస్బన్‌లోని ఓ హోటల్ గదిలో ఉన్నాం. కాఫీ టేబుల్‌‌పై వాడిని పడుకోబెట్టి,వాడి డైపర్ మారుస్తూ, జెట్-ల్యాగ్ వల్ల అస్తవ్యస్తంగా ఉన్న స్వరంతో మా డైపర్-చేంజ్ పాట పాడుతుంటే, తెల్లవారుజామున నగరం నుంచి వస్తున్న శబ్దాలు కిటికీలోంచి లోపలికి వినిపిస్తున్నాయి.

ఆ శబ్దాల మిశ్రమంలో ఏదో ఒకటి వాడిని ఉల్లాసపరిచింది. వాడు పకపకా నవ్వడం మొదల...