భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశ రాజధాని దిల్లీలో మహిళలు, చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తించే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 2026 సంవత్సరం ప్రారంభ 15 రోజుల్లోనే దిల్లీలో 800 మందికి పైగా అదృశ్యమైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. అదృశ్యమైన వారిలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలు, బాలికలే ఉన్నారు.

పీటీఐ సేకరించిన దిల్లీ పోలీసుల అధికారిక డేటా ప్రకారం.. జనవరి 1 నుంచి జనవరి 15 మధ్య కాలంలో మొత్తం 807 మంది అదృశ్యమయ్యారు. అంటే సగటున ప్రతిరోజూ 54 మంది ఆచూకీ లేకుండా పోతున్నారు. వీరిలో 509 మంది మహిళలు, బాలికలు కాగా, 298 మంది పురుషులు ఉన్నారు.

మొత్తం అదృశ్యమైన వారిలో 191 మంది మైనర్లు ఉండగా, 616 మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులు 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు, మిగిలిన 572 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు...