భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఈ ఏడాది మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు UDID కార్డులు, త్రీవీలర్ మోటార్ బైకుల పంపిణీ, దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లు, వయోవృద్ధులకు వయో వందన ఆయుష్మాన్ భారత్ కార్డులు, సహాయ పరికరాల పంపిణీ, ట్రాన్స్ జెండర్స్‌కి గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అడ్మిషన్లు 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. ద...