Hyderabad, జూలై 30 -- సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలైంది. ఇప్పటి నుంచి 6 నెలల పాటు అంటే మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడి గమనాన్ని బట్టి కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరం దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణం అని, భూమధ్యరేఖకు దక్షిణ దిశలో కనిపిస్తే దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనం ప్రారంభం రోజునే కర్కాటక సంక్రాంతిగా జరుపుకుంటారు.

కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం ప్రారంభం కాగా, మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఈసారి ఈ కర్కాటక సంక్రాంతి జూలై 16వ తేదీన మొదలైంది. సూర్యుడు కుంభ, మకర, మీన, మేష, వృషభ, మిథున రాశుల్లో సంచరించినప్పుడు ఆ 6 నెలల కాలం ఉత్తరాయణం ఉంటుంది. ఇక కర్కాటక, సింహ, తులా, కన్యా, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో సంచర...