భారతదేశం, ఫిబ్రవరి 3 -- 2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రైల్వే నెట్‌వర్క్ విస్తరణ కోసం ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి 2009-14 మధ్య చేసిన సగటు వార్షిక కేటాయింపులతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ అని మంత్రి వైష్ణవ్ అన్నారు.

ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు-హైదరాబాద్-పుణే, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు.. వేగవంతమైన ప్రయాణ మార్గాల నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయని చెప్పారు. ఇవి ప్రయాణ సమయాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని కూడా వేగవంతం చేస్తాయని వైష్ణవ్ అన్నారు.

ఎలివేటెడ్ అలైన్‌మెంట్లు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు, ఇతర భాగాలపై...