భారతదేశం, ఫిబ్రవరి 5 -- బీసీ జనాభాలో ఏ ఉప కులాలు వెనుకబడి ఉన్నాయో గుర్తించడానికి విద్యార్థుల కులంపై డేటాను సేకరించాలని విద్యా శాఖను బీసీ కమిషన్ కోరింది. రాష్ట్రంలో విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సమాచారాన్ని కులాల వారిగా సేకరించే అంశంపైన బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు బీసీ కమిషన్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు.

మార్చి నాటికి డేటాను కమిషన్‌కు అందజేస్తామని విద్యాశాఖ హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం నుండే అడ్మిషన్ల సమయంలో కుల సంబంధిత సమాచారాన్ని సేకరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కూడా తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థుల డేటాను సేకరించడంలో జాప్యం జరుగుతోందని, దీని ప్రాధాన్యతను గుర్తించి సమాచారం సేకరించాలని బీసీ కమిషన్ చెప్పింది.

ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ వర్గానికి చెందినవా...