భారతదేశం, జనవరి 31 -- మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు.

నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో ఇవాళ పరిశీలిస్తారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా ఆసక్తి కనబరిచారు. మిర్యాలగూడ పురపోరులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం నుంచి బరిలో నిలిచారు. ఆయన భార్య మాధవి, కు...