భారతదేశం, జనవరి 29 -- తెలంగాణలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోని 500కి పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 రోజుల్లోనే హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యాయి. 2,010 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి పాఠశాల విద్యా శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టి-ఫైబర్) ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది.

మొదటి దశ కింద ప్రధాన టెలికాం ఆపరేటర్లు లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కవర్ చేయని గ్రామాల్లోని పాఠశాలలను కనెక్ట్ చేయడానికి టీ-ఫైబర్ వర్క్ ఆర్డర్‌ను పొందిందని అధికారులు చెప్పారు. మొదటి నెలలో బాగంగా 500కి పైగా స్కూళ్లను కవర్ చేశారు. తర్వాది దశలో 1,410 పాఠశాలలను దశలవారీగా ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 26,000కుపై ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించేందుకు ...