భారతదేశం, జూలై 7 -- తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం పేర్కొంది.

జూలై 7 సోమవారం రోజు ఉరుములు, పిడుగులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గాలులు వేగంగా వీస్తాయని హెచ్చరించింది.

జూలై 8 మంగళవారం రోజు ఉరుములు, పిడుగులు, బలమైన గాలులతో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది. గాలులు బలంగా, వేగంగా వీస్తాయని హెచ్చరించింది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో బుధవారం కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Published by...