Telangana,hyderabad, జూన్ 11 -- తెలంగాణలోని కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవలనే తెలంగాణ కేబినెట్ ను విస్తరించిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే వారికి శాఖలు కేటాయించలేదు. మరోవైపు శాఖల కేటాయింపుతో పాటు విస్తరణ విషయంపై సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. శాఖల కేటాయింపులపై సుదీర్ఘంగా పార్టీ పెద్దలతో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కీలక శాఖలు ఉండటంతో. వాటి నుంచే ఇస్తారనే చర్చ జరిగినప్పటికీ అలా కుదరలేదు. కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి.

ఇక కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన ఈ ముగ్గురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే కావటం విశేషం. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎ...