Telangana,hyderabad, జూలై 3 -- ప‌దవ త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. 10వ త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో ఉత్తీర్ణ‌త క‌నిపిస్తున్నప్పటికీ. ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే స‌రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా ఎందుకు తగ్గుతోందని ఆరా తీశారు. త‌గ్గిపోవ‌డానికి గ‌ల కారణాలను అధ్యయనం చేసి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు.

బుధవారం రోజు విద్యాశాఖ‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద‌శ కీల‌క‌మైనందని.. ఆ ద‌శ‌లో విద్యార్థికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల్లో 9 వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు(సీనియర్‌ సెకండరీ స్కూల్స్‌) అమలు...