భారతదేశం, నవంబర్ 21 -- తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల మహాద్వారానికి వెళ్లిన రాష్ట్రపతి.. మొదట శ్రీ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అంతకంటే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె కుటుంబ సభ్యులు, పరివారంతో కలిసి రాష్ట్రపతి ప్రార్థనలు చేశారు. పూజారులతో కలిసి రాష్ట్రపతి మహా ద్వారంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం వద్ద ప్రార్థనలు చేశారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను...