భారతదేశం, జనవరి 29 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్ధారించింది. దీనితో ప్రజల ఆగ్రహానికి కారణమైన విస్తృత ఊహాగానాలకు తెరపడినట్టైంది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్‌ అధికారులు శాస్త్రీయ పరీక్షల ఫలితాలను వివరిస్తూ.. సీబీఐ 600 పేజీల తుది ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. అయితే కల్తీ నెయ్యి సరఫరా అయిన మాట వాస్తవమేనని సిట్ గుర్తించింది.

దర్యాప్తు సంస్థ ప్రకారం ఆలయ ట్రస్ట్‌కు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ICAR-NDRI) ఒక నివేదికను సమర్పించింది. గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నుండి నివేదిక అందిన తర్వాత మరింత ధృవీకరణ కోరినట్లు సీబీఐ తెలిపింది.

మెుత్తానికి టీటీడీ దే...