Andhrapradesh, సెప్టెంబర్ 6 -- తిరుమల శ్రీవారిని నిత్యం దర్శించుకునే భక్తులు కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. ఇందులో సామాన్యుల నుంచి అత్యంత ధనవంతుల వరకు ఉంటారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస్థలు ఇలా అనేక రకాలుగా విరాళాలు అందజేస్తుంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు.

టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం రోజు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు)ను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు అందజేశారు. భారీ విరాళం ఇచ్చినప్పటికీ. ఆయన తన పేరు చెప్పడానికి నిరాకరించడం విశేషం.

సెప్టెంబర్ 07న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి టీటీడీ పరిధిలోని పలు ఆలయాలను మూస...