భారతదేశం, ఫిబ్రవరి 5 -- తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సిట్ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మరోవైపు సీబీఐ నేతృత్వంలోని సిట్. వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదంటూ కూటమి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే. కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది.

లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు ఇవాళ కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఏకసభ్య కమిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు.

నెయ్యి కల్తీపై 2022లో నివేదిక వస్తే అప్పటి పాలకులు ఎందుకు తొక్కిపెట్టారు? అని ముఖ్యమంత్రి చం...