భారతదేశం, జనవరి 31 -- శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్త‌వం కాద‌న్నారు. సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టంగా నమోదు అయిందని ఆయన పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగాయని.. కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలను మార్చారని తెలిపారు.

సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో 60 ల‌క్ష‌ల కి...