భారతదేశం, అక్టోబర్ 26 -- తిరుమలలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నీటి నిల్వలకు సంబంధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా విడుదల చేసింది.

తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరదనీటి ప్రవాహంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 215 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయని టీటీడీ వెల్లడించింది.

పాపవినాశనం డ్యామ్ నిల్వ సామర్థ్యం 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు కాగా. దాదాపుగా నిండింది. గోగర్భం డ్యామ్ నిండిపోవటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆకాశగంగ డ్యామ్ నిల్వ సామ‌ర్థ్యం 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లుగా ఉండగా. దాదాపుగా న...