భారతదేశం, ఫిబ్రవరి 23 -- తల్లిదండ్రులు తమకంటే చాలా తక్కువ వయసు ఉన్నవారితో డేటింగ్ చేసినప్పుడు, పిల్లలతో పొత్తు కుదరడం కాస్త కష్టమే. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒక ఇంట్లో చిచ్చు రేపింది. తన తండ్రి ప్రేమించిన యువతి, తమ వ్యక్తిగత విషయాల్లో, వేసుకునే బట్టల విషయంలో మితిమీరి జోక్యం చేసుకోవడంతో ఓ 23 ఏళ్ల యువతి సహనం కోల్పోయింది. చివరకు తండ్రికి అల్టిమేటం ఇచ్చి మరీ ఆ బంధాన్ని తెగతెంపులు చేయించింది.

ఈ కథనంలోని యువతి (23), ఆమె చెల్లెలు (16) తమ తండ్రి (47)తో కలిసి ఉంటున్నారు. తండ్రి గత ఆరు నెలలుగా 'యాష్లే' అనే 28 ఏళ్ల యువతితో డేటింగ్ చేస్తున్నాడు. మూడు నెలల క్రితమే ఆమెను తన కూతుళ్లకు పరిచయం చేశాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, మెల్లగా యాష్లే అసలు స్వరూపం బయటపడింది.

హిస్పానిక్ సంస్కృతిలో పెరిగిన ఆ యువతికి తన తండ్రి పట్ల ఎంతో గౌరవం ఉంది. అయితే, యాష్లే మాత్రం ఆ...