Andhrapradesh,telangana, జూలై 17 -- బనకచర్ల ప్రాజెక్ట్ తో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి తారా స్థాయికి చేరింది. ఇప్పటికే కృష్ణా, గోదావరి బేసిన్ లో నిర్మించిన ప్రాజెక్టులపై వివాదాలు ఉండగానే. తాజాగా ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రతిపాదనతో ఇరు ప్రభుత్వాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే. తాజాగా ఢిల్లీ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో. కృష్ణా, గోదావరి ప్రాజెక్ట్ లపై చర్చించారు.

ఈ భేటీ సమావేశం ముగిసిన తర్వాత. ఇరు ప్రభుత్వాల తరపున మంత్రులు మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలు. అంగీకారం కుదిరిన విషయాలను ప్రకటించారు. ప్రధానంగా 4 అంశాల విషయంలో అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. ఇంతవరకు సవ్యంగానే ఉన్నప్పటికీ.. బనకచర్ల ప్రాజెక్ట్ పై భిన్నమైన ప్రకటనలు చేశారు. దీంతో అసలు ఈ ప్...