భారతదేశం, డిసెంబర్ 25 -- డిసెంబర్​ 25, గురువారం, నేడు క్రిస్మస్​. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కాగా క్రిస్మస్​ని పురస్కరించుకుని భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు నేడు సెలవు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. డిసెంబర్ 25 దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా అన్ని ప్రధాన బ్యాంకులు నేడు కార్యకలాపాలను నిలిపివేస్తాయి. డిసెంబర్ నెలలో మొత్తం 14 రోజులు సెలవుల కోటా ఉండగా, ఇప్పటికే మెజారిటీ సెలవులు ముగిశాయి.

క్రిస్మస్ తర్వాత కూడా ఈ నెలలో మరో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆ వివరాలు..

డిసెంబర్ 26: క్రిస్మస్ వేడుకల కొనసాగింపుగా ...