Hyderabad, ఏప్రిల్ 28 -- శరీరంలో డయాబెటిస్ చేరితే ఎన్నో రకాల రోగాలు దానితో పాటే వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకుంటే... డయాబెటిస్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కలగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఎప్పుడైతే డయాబెటిస్ వచ్చిందో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండకపోతే ఆ పరిస్థితి మూత్రపిండాల వ్యాధి డయాబెటిక్ నెప్రోపతి వచ్చేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

జీవనశైలి మార్పుల ద్వారా అవసరమైన మందులు వాడడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. అందుకోసం కిడ్నీ ఫ్రెండ్లీ డైట్ ని కూడా తీసుకోవాల్సి వస్తుంది.

డయాబెటిక్ నెప్రోపతిని డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అని కూడా అంటారు. కిడ్నీలు దెబ్బతీసేలా మధుమేహం పెరగడమే దీనికి కారణం. డయాబెటిక్ నెఫ్రోపతి వస్...