భారతదేశం, డిసెంబర్ 8 -- ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 447 పాయింట్లు పెరిగి 85,712 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 153 పాయింట్లు వృద్ధిచెంది 26,186 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 488 పాయింట్లు పెరిగి 59,777 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 438.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,189.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ డిసెంబర్​​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 10403.62 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 19,785.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్...