భారతదేశం, డిసెంబర్ 24 -- అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్కీలకు డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. హెచ్-1బీ వర్క్ వీసాల ఎంపికలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న 'లాటరీ' విధానాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో అభ్యర్థుల నైపుణ్యం, వారికి చెల్లించే వేతనం ఆధారంగా వీసాలను కేటాయించే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతున్నట్టు మంగళవారం స్పష్టం చేసింది.

"అత్యున్నత నైపుణ్యాలు ఉండి, ఎక్కువ వేతనం పొందే విదేశీ కార్మికులకే హెచ్​-1బీ వీసాల కేటాయింపులో ఇక నుంచి ప్రాధాన్యత ఇస్తాం," అని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్​ఎస్​) మంగళవారం ప్రకటించింది. అమెరికన్ కార్మికుల వేతనాలను, వారి పని పరిస్థితులను, ఉద్యోగ అవకాశాలను కాపాడటమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.

ఈ కొత్త నిబంధనలు 2026, ఫిబ్రవరి 2...