భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఇటీవలి కాలంలో ఎవరు.. ఎందుకు.. ఎలా చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను తీసేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ అలాంటి ఘరోమైన ఘటనే జరిగింది. కేవలం టీవీ సౌండ్ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరిలో షేక్ అహ్మద్ అనే 27 ఏళ్ల వ్యక్తి ఏసీ మెకానిక్‌గా పనిచేస్తు్న్నాడు. కొన్ని నెలల కిందట క్రాంతి అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు.

గురువారం రాత్రి క్రాంతి ఇంట్లో టీవీ సౌండ్ పెంచింది. మరీ అంత సౌండ్ అవసరమా.. తగ్గించు అంటూ అహ్మద్ చెప్పాడు. నన్ను టీవీ సౌండ్ తగ్గించమంటావా అంటూ క్రాంతి గట్టిగా అరిచింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో భార్యపై అహ్మద్ చేయిచేసుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పక్కనే ఉ...