భారతదేశం, జనవరి 25 -- హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. తనను కాంగ్రెస్‌లోకి చేర్చుకోమని.. టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నారని గుర్తుచేశారు. మహేశ్ కుమార్‌ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జాగృతిలో చేరితే మంచి పోస్ట్ ఇస్తానని ప్రకటించారు.

'అసలు నేనేందుకు కాంగ్రెస్‌లో చేరుతాను? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలవబోతోంది. నన్ను బద్నాం చేసే పనిలో మహేశ్ గౌడ్ ఉన్నారు. నేను కాంగ్రెస్‌లో చేరుతానని మహేశ్ కుమార్‌ గౌడ్‌కు కల వచ్చిందా? ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలి. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నాను.' అని కవిత అన్నారు.

సృజన్ రెడ్...