భారతదేశం, ఫిబ్రవరి 3 -- టీజీపీఎస్సీలో ఉద్యోగాల కోసం చూసే అభ్యర్థులకు కమిషన్ కీలక విషయం తెలిపింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓటీఆర్‌కు సంబంధించి కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తులో కీలకమైన ఓటీఆర్ చేసుకున్న 31.56 లక్షల మంది తమ ఐడీ సాయంతో తాజా వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

భవిష్యత్తులో వచ్చే అన్ని నోటిఫికేషన్లు, దరఖాస్తులు, ఫలితాలు, తుది ఎంపికలు అభ్యర్థుల ఇప్పుడు అప్డేట్ చేసే OTR డేటా ఆధారంగా ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. దాని ప్రకారం డేటా వ్యవస్థలో దాదాపు 31.65 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారంతా.. ఇప్పుడు అప్డేట్ చేయాలి.

షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, అభ్యర్థుల విద్యా అర్హతలలో మార్పుల కారణంగా ఇప్పుడు ఓటీఆర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తాజా వివరాల తప్పనిసరిగా నమోదు చేయాలని కమిషన్ పేర్కొంది. 'నియామక ప్రక్రియలను వేగ...