భారతదేశం, జనవరి 13 -- భారత ఆటోమొబైల్ రంగంలో మైక్రో ఎస్‌యూవీ ట్రెండ్‌కు ఊపిరిపోసిన 'టాటా పంచ్' ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, మరింత పవర్‌ఫుల్‌గా మన ముందుకు వచ్చింది. ఈ మేరకు టాటా పంచ్​ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మంగళవారం (జనవరి 13) మార్కెట్​లోకి విడుదల చేసింది టాటా మోటార్స్​ సంస్థ. కేవలం రూ. 5.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ కారు కోసం బుకింగ్స్ కూడా నేటి నుంచే ప్రారంభమయ్యాయి.

హ్యుందాయ్ ఎక్స్​టర్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా టాటా మోటార్స్ ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీర్చిదిద్దింది. ఈ 2026 టాటా పంచ్‌ ఫ్యామిలీ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చూడగానే టాటా పంచ్ ఈవీని గుర్తుకు తెస్తుంది. దీని బాక్సీ ఆకారాన్ని అలాగే ఉంచుతూనే, ముందు భాగంలో గణనీయమైన మార్పులు చేశా...