భారతదేశం, జనవరి 30 -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది సాపేక్ష సిద్ధాంతం (Theory of Relativity), భౌతికశాస్త్రంలో ఆయన అందుకున్న నోబెల్ బహుమతి. అయితే, ఆ మేధావి కేవలం అంకెలు, సమీకరణాలకే పరిమితం కాలేదు. జీవితం పట్ల ఆయనకు చాలా లోతైన, స్పష్టమైన దృక్పథం ఉండేది. సంక్లిష్టమైన విషయాలను సైతం సామాన్యులకు అర్థమయ్యేలా చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పడం ఆయన శైలి.

1930, ఫిబ్రవరి 5న ఐన్‌స్టీన్ తన కుమారుడు ఎడ్వర్డ్‌కు ఒక లేఖ రాశారు. అందులో ఆయన పంచుకున్న ఒక చిన్న సలహా నేటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. అదే.. "జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. మీ బ్యాలెన్స్‌ను కాపాడుకోవాలంటే, మీరు నిరంతరం కదులుతూనే ఉండాలి."

పైకి చూస్తే ఇది చాలా సాధారణమైన వాక్యంగా అనిపించవచ్చు. కానీ, ఇందులో ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. మనం సైకిల్ తొక్కుతున్నప్పుడ...