భారతదేశం, ఆగస్టు 21 -- జియో ఇటీవలే రోజుకు 1జీబీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలను, 28 రోజుల చెల్లుబాటును అందించే రూ.249 బేస్ ప్లాన్‌ను తొలగించింది. అయితే, 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1.5జీబీ డేటాను అందించే రూ.799 ప్లాన్‌ను సైతం జియో రద్దు చేసినట్టు వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని జియో తాజాగా స్పష్టం చేసింది.

ఈ జియో రూ. 799 ప్లాన్ రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్​ రద్దు అయ్యిందన్న వార్తలు జియో యూజర్లకు షాక్​ ఇచ్చాయి. అయితే రూ. 799 రీఛార్జ్​ ప్లాన్​ కొనసాగుతోందని సంస్థ స్పష్టం చేసింది.

రూ. 799 తర్వాత జియో నుంచి రూ. 889 ప్యాక్​ అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్​ ప్లాన్​ అపరిమిత కాలింగ్, జియోసవాన్ ప్రో, జియో టీవీ, జియోఏఐక్లౌడ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. అంతేకాదు, డేటా ...