భారతదేశం, డిసెంబర్ 6 -- జాతీయ రహదారులపైన ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాల వ్యవస్థను పూర్తిగా తొలగించి, ఇకపై ఎలాంటి బారియర్లు లేని ఎలక్ట్రానిక్ టోల్‌ వసూలు విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఈ వ్యవస్థను ఏడాదిలోగా అమలు చేస్తామని లోక్‌సభకు తెలియజేశారు.

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్​సభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మాట్లాడుతూ.. వాహనాల రాకపోకలకు ఏమాత్రం అంతరాయం కలిగించకుండా, టోల్ బూత్‌ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్‌ విధానాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే 10 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) అమలు చేయడం ప్రారంభించామని, రాబోయే 12 నెలల్లో దేశవ్యాప్తంగా దీనిని విస్తరిస్తామని ఆయన వివరించారు.

"ప్రస్తుత ...