భారతదేశం, జూన్ 26 -- ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలోకి వచ్చే ప్రాంతీయ శక్తుల పాలనలో ఇష్టానుసారంగా నడచుకోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణమే క్షీణిస్తోంది. సిద్దాంత బలం, విధానాల నిబద్దత లేని ప్రాంతీయ శక్తులు గద్దెనెక్కిన నుంచి నిరంతరం ఆధిపత్య సాధన, ప్రత్యర్థుల అణచివేత పైనే దృష్టి పెట్టడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. జనానికొక ప్రత్యామ్నాయ అవకాశంగా జాతీయ పార్టీలు బలపడే సూచనలేవీ కనిపించడం లేదు.

రాష్ట్రంలో ఎదుగుదలకు అవకాశం ఉండీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా ఉనికి కోల్పోయే స్థితిలోకి జారుతున్నాయి. 2024 ఎన్నికలు ముగిసి ఏడాదయినా... ఏపీలో ఏ జాతీయ పార్టీ పుంజుకోవటం లేదు. పైగా మరింత బలహీనపడుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా ఆయా పార్టీల జాతీయ నాయకత్వపు ఉదాసీన వైఖరే కారణంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, బీ...