Andhrapradesh, జూలై 2 -- వైఎస్ జగన్ మరోసారి పాత ఫార్ములాతోనే ముందుకు రానున్నారు. 2019 ఎన్నికల కంటే ముందు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రతో వైసీపీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన జగన్. ఆ ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో విక్టరీ కొట్టారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీకి. 2024 ఎన్నికలు పీడకలను మిగిల్చియానే చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండగా.. వచ్చే ఎన్నికలకు ఇప్పట్నుంచే సిద్ధమయ్యే పనిలో పడింది.

అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ బలోపేతంపై మళ్లీ ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. గత కొంతకాలంగా జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చేది మనమే అన్న ధీమాను వారిలో నింపుతున్నారు. అయితే తాజాగా ఆయన వైసీపీ యువజన విభాగం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరోసా...