భారతదేశం, ఫిబ్రవరి 3 -- జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలు పసుపుకోతకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. మల్లాపూర్ మండలం ముగిలిపేట వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....