భారతదేశం, నవంబర్ 22 -- ఓపెన్‌ఏఐ సంస్థ గత వారం చాట్‌జీపీటీలో గ్రూప్ చాట్స్ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే, మొదట్లో ఈ ఫీచర్ కొన్ని ప్రాంతాలdలోని, కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది! దీనితో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాట్‌జీపీటీ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు 20 మంది వరకు వ్యక్తులను సంభాషణలోకి ఆహ్వానించవచ్చు. ప్రయాణాలు, ప్రాజెక్టులు, ఆఫీస్ పనులు, ఇతర విషయాలపై చర్చించడానికి ఈ గ్రూప్‌ల్లో చాట్‌జీపీటీ కూడా భాగమవుతుంది. చాట్‌జీపీటీ కొత్త గ్రూప్ చాట్స్ ఫీచర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి..

చాట్‌జీపీటీలో వచ్చిన ఈ సరికొత్త గ్రూప్ చాట్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అందుబ...