భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన సమావేశం అనంతరం ఈ నిధుల విడుదల జరిగింది. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల ఖర్చులను తీర్చడానికి నిధులను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా నిధులు విడుదలయ్యాయి.

ఈ శుభవార్తను గ్రామాలకు తెలియజేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

గతేడాది డిసెంబర్‌లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. నూతన సర్పంచ్‌‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో నూతన సర్పంచుల...