Telangana, మే 30 -- బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన సూటి ప్రశ్నలతో నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇదే సమయంలో తనది బీఆర్ఎస్ పార్టీ అని. మా నాయకుడు కేసీఆర్ అంటూ క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. పార్టీని కాపాడుకోవాలనేదే తన లక్ష్యమని చెప్పుకొస్తున్నారు. కవిత వరుసగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో. అసలు ఆమె ఎవర్నీ టార్గెట్ చేస్తున్నారు..? ఆమె టార్గెట్ ఏంటన్న ప్రశ్నల చుట్టు జోరుగా చర్చ జరుగుతోంది.

గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత గురువారం మీడియాతో పలు అంశాలపై చిట్ చాట్ చేశారు. అధినాయకత్వాన్ని ఉద్దేశించి కొన్ని కీలక ప్రశ్నలను సంధించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులిస్తే.. పార్టీ ఎలాంటి కార్యాచరణ తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్రస్థాయిలో నిరసనలు చేపట్టవద్దా.? ట్విట్టర్ వేదికగా మేస...