Telangana,hyderabad, ఆగస్టు 24 -- ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో వెలుగు చూసింది.

పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. ఆగస్టు 22న చత్తీస్ గఢ్ కు చెందిన ఓ బాలిక చర్లకు మండలానికి చేరుకుంది. అక్కడి నుంచి వాజేడు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అప్పటికే ఇద్దరు వ్యక్తులు అందులో ఉన్నారు. వారు బాలికకు డ్రింక్ ఇవ్వగా. అది తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు బాధితురాలు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత. ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డినట్లు తెలిసింది.విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి పోలీసులు చేరుకుని. అన్ని కోణాల్లో విచారిస్త...