భారతదేశం, జనవరి 27 -- కొత్త ఎయిర్‌ట్యాగ్ లాంచ్‌తో యాపిల్ తన స్మార్ట్ పరికరాల ఈకో సిస్టెమ్​ని మరోసారి బలోపేతం చేస్తోంది. వస్తువుల లొకేషన్‌ను కచ్చితంగా గుర్తించడం, డిజిటల్ భద్రత అనేది లక్షలాది మంది వినియోగదారులకు అత్యవసరంగా మారిన నేటి కాలంలో, ఈ కొత్త ఎయిర్​ట్యాగ్​ కీలకంగా మారింది. ఈ కొత్త ఐటెమ్​ ట్రాకర్​లో పనితీరు పరిధిని, కచ్చితత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా, దాని వినియోగాన్ని మరింత విస్తరించింది యాపిల్​. ముఖ్యంగా ప్రయాణికులకు, తమ వస్తువులపై గట్టి నియంత్రణ ఉండాలని కోరుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరికరం గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కొత్త ఎయిర్‌ట్యాగ్ దాని ఒరిజినల్ లాంచ్ నాటి కాంపాక్ట్, మినిమలిస్ట్ డిజైన్‌ను అలాగే ఉంచుకుంది. దీని గుండ్రని, తక్కువ బరువు కలిగిన డిజైన్.. కీలు, బ్యాగులు, సూట్‌కేసులు లేద...