Telangana,hyderabad, జూలై 27 -- హైదరాబాద్ కొండాపూర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో తలపెట్టిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్ పెడ్లర్లతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

ఈ రేవ్ పార్టీ నిర్వహణపై పక్కా సమాచారం అందటంతో టాస్క్ ఫోర్స్ బృందం శనివారం రాత్రి కొండాపూర్ ప్రాంతంలో నిఘా పెట్టింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

విజయవాడకు చెందిన వాసు, శివం రాయుడు రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం వారు ఇతరుల గుర్తింపు కార్డులు వాడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ పార్టీని నిర్వహించే ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పెడ్లర్లతో కలిసి సర్వీస్ అపార్ట్ మెంట్ ను బుక్ చేసినట్లు దర్యాప్తు అధి...