భారతదేశం, ఫిబ్రవరి 1 -- బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను సిట్ విచారణ చేయడంపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్ని దుష్ట శక్తులకు వ్యతిరేకంగా బలంగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత రాజకీయ ప్రత్యర్థుల చౌకబారు వ్యూహాలకు తలొగ్గరని నొక్కి చెప్పారు.

'తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో చంద్రశేఖర్ రావు ఒత్తిడిని, కష్టాలను తట్టుకున్నారు. ఢిల్లీ ఒత్తిడికి ఆయన ఎప్పుడూ తలొగ్గలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో ఆయన దృఢంగా ఉన్నారు. కేసీఆర్ అజేయుడు. మూర్ఖులు చరిత్రను అర్థం చేసుకోలేరు, చరిత్ర సృష్టించడం కూడా చేయలేరు.' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ పేరు వింటేనే వణికిపోతారని, కానీ ఆయన పేరు చెప్పేంత స్థాయి కూడా వారికి లేదన్నారు కేటీఆర్.

కేసీఆర్‌పై రాజకీయ ప్రతీ...