భారతదేశం, ఫిబ్రవరి 3 -- సాధారణంగా మనం తినే లడ్డూల్లో నెయ్యి, చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది. కానీ వంశిక పరిచయం చేసిన ఈ లడ్డూల్లో రిఫైన్డ్ షుగర్ అస్సలు ఉండదు. పైగా ఇందులో వాడిన పదార్థాలు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ఈ కాల్షియం బాల్స్ తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల ఆరోగ్యంతో పాటు హార్మోన్ల సమతుల్యత, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ మిశ్రమంతో సుమారు 20 లడ్డూలు తయారవుతాయి. ఇలా ఒక్కో లడ్డూలో సుమారు 90 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుని రోజూ ఒకటి తీసుకోవచ్చు.

(గమనిక: ఈ సమాచారం సోషల్ మీడియాలోని కంటెంట్ ఆధారంగా సేకరించినది. పైన పేర్కొన్న అంశాలను నిర్ధారించడంలో గానీ, ప్రోత్సహించడంలో గానీ మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉ...