భారతదేశం, ఫిబ్రవరి 2 -- కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఒక రోజు తర్వాత న్యూఢిల్లీ నుండి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. రాష్ట్రాల వారీగా కేటాయింపులు, కీలక రైల్వే ప్రాజెక్టులను వివరించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్‌లను ప్రధాన గేమ్ ఛేంజర్‌లుగా వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ 2026-27ను కర్ణాటకకు రికార్డ్ బడ్జెట్‌గా అభివర్ణించారు. రూ.7,748 కోట్ల రైల్వే కేటాయింపులు, రాష్ట్రంలో రూ.52,950 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు.

బడ్జెట్‌లో ప్రకటించిన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో అంతర్ నగర ప్రయాణాన్ని గణనీయంగా మారుస్తాయని వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను డైమండ్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. హైస్పీడ్ కారి...