Telangana, మే 24 -- "ఎల్కతుర్తి సభ తర్వాత రెండు వారాల క్రితం పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశా. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావడం లేదు. కేసీఆర్‌ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్‌ అయింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి? నా లేఖ లీక్‌ వెనుక ఎవరో ఉండి ఉండొచ్చు". ఇవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు.! లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేసిన ఆమె.. పార్టీలో కోవర్టులు ఉన్నారని. కేసీఆర్ చుట్టు దెయ్యాలున్నాయని ఆరోపించారు. అయితే కవిత చేసిన ఈ వ్యాఖ్యలు. పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావటం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. లేఖ లీక్ వెనక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కవిత చేసిన ఈ ఆరోపణలతో అనేక అంశాలు త...